Homeతెలంగాణఆ ముగ్గురిలో మినిస్ట్రీ ఎవరికి?

ఆ ముగ్గురిలో మినిస్ట్రీ ఎవరికి?

– మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నసీతక్క, కొండా సురేఖ, రేవూరి
– ఇద్దరికి అమాత్య పదవి దక్కే చాన్స్​
– సీనియార్టీ, విధేయతను ప్రామాణికంగా తీసుకోనున్న అధిష్ఠానం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: వరంగల్​ జిల్లా నుంచి మంత్రి పదవి కోసం కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్​ రెడ్డి, సీతక్క, దొంతి మాధవరెడ్డి పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ఇద్దరికీ అమాత్య పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్​ సీనియారిటీ విధేయతను ప్రామాణికంగా తీసుకొనే అవకాశం ఉంది. అధిష్ఠానం రేవంత్​ రెడ్డి పేరును ముఖ్యమంత్రిగా ఖరారు చేయడంతో మంత్రి పదవులపై ఆసక్తి నెలకొన్నది. రేవంత్​ టీమ్​లో ఎవరికి స్థానం ఉంటుందని విషయం ఇంట్రెస్టింగ్​గా మారింది. సీతక్కకు కూడా మంత్రి పదవి ఖాయమైనట్టు సోషల్​ మీడియాలో చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్​ జిల్లా నుంచి మొత్తం ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయని సమాచారం. కొండా సురేఖ గతంలో మంత్రిగా పనిచేశారు. దీంతో ఆమె కూడా పదవి కోసం పోటీ పడుతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవ రెడ్డి సైతం మంత్రి పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన కోటా, మహిళా కోటాలో సీతక్క మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇక కొండా సురేఖ సైతం బీసీ కోటా, మహిళా కోటాలో పదవిని ఆశిస్తున్నారు. రేవూరి ప్రకాశ్​ రెడ్డి సైతం రేవంత్​ రెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన కూడా పదవిని ఆశిస్తున్నారు. మరి హైకమాండ్​ కరుణ ఎవరి మీద ఉంటుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img