Homeహైదరాబాద్latest Newsఆ రాష్ట్రాల్లో 'గేమ్ ఛేంజర్' మూవీ భారీ షాక్.. కష్టమే..!

ఆ రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ భారీ షాక్.. కష్టమే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ కన్నడలో లేదని, కన్నడలో పోస్టర్లు విడుదల చేయలేదని కన్నడ భాషాభిమానులు కర్ణాటకలో అతికించిన గేమ్ ఛేంజర్ పోస్టర్లపై నల్లరంగు పూస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను విమర్శిస్తూ.. ఈ సినిమాను బాన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమిళనాడులో కూడా ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి కష్టాలు తప్పడంలేదు.. ఈ విడుదలను నిలిపివేయాలని లైకా ప్రొడక్షన్స్ తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. డైరెక్టర్ శంకర్ కి లైకా ప్రొడక్షన్స్‌ తో ఉన్న విబేధాలు కారణంగా ఈ వివాదం నడుస్తుంది.

Recent

- Advertisment -spot_img