తెలంగాణలో త్వరలో విద్యుత్ ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అందిస్తోంది. 300 యూనిట్లు దాటితే కిలోవాట్ కు స్థిరఛార్జీని రూ10 నుంచి రూ.50కి పెంచాలని డిస్కంలు ERCకి ప్రతిపాదించాయి. పరిశ్రమలకు సంబంధించి 11KVకి యూనిట్ కు రూ.7.65, 33KVకి రూ.7.15, 132KVకి రూ.6.65 వసూలు చేస్తుండగా, ఇకపై అన్ని కేటగిరీలకు రూ.7.65 చొప్పునే వసూలు చేయాలని కోరాయి.