నిత్యావసరాల ధరలు చుక్కలన్నంటడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. దీనికితోడు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇక కూరగాయలు ధరలు కూడా ఆకాశాన్నంటుండడంతో పేదలు రేషన్ బియ్యం, పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆదాయం ఇసుమంత ఉంటే.. ఖర్చులు మాత్రం కొండంత ఉన్నాయని, పెరిగిన ధరలతో నెలనెలా వచ్చే జీతం ఏ మూలకూ సరిపోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.