తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే కొనసాగుతోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతిదీ యాప్ లో నమోదు చేస్తున్నారు. కాగా ఈ నెలాఖారులోపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. సర్వేలో భాగంగా దరఖాస్తుదాడి ఫొటోతో పాటు ఖాళీ స్థలం, ప్రస్తుతం ఉంటున్న ఇంటి చిత్రాలను కూడా యాప్లో అప్ లోడ్ చేస్తున్నారు. కాగా ఈ పథకం కింద ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వనుంది.