Homeహైదరాబాద్latest Newsరైతు బంధుకు అర్హులు వీళ్లే.. సీఎం కీలక ప్రకటన

రైతు బంధుకు అర్హులు వీళ్లే.. సీఎం కీలక ప్రకటన

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రైతు బంధు విషయంలో చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక రైతు బంధు పథకంపై మొదటి నుంచి కాంగ్రెస్​ పార్టీ వ్యతిరేకంగా ఉంది. ఈ పథకంతో వందల ఎకరాలు ఉన్నవారికి.. ఫామ్​ హౌసులు ఉన్నవారికి లబ్ధి చేకూరుతోంది.. పేద రైతులకు పెద్దగా ఉపయోగం లేదని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ దఫా రైతు బంధు పాత పద్ధతిలో ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎకరాకు15,000 ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పాత పద్ధతిలో పదివేలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా అందరికీ అందలేదు. రైతు భరోసా విషయంలో కొత్తగా మార్గదర్శకాలు జారీ చేస్తామని గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం చెప్పింది. అయితే తాజాగా సీఎం రేవంత్​ రెడ్డి మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ.. రైతు బంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం వ్యవసాయం చేసేవాళ్లకు మాత్రమే రైతు బంధు ఇస్తామని క్లారిటీ ఇచ్చేశారు. వ్యవసాయం చేయకుండా కేవలం భూమి ఉన్న యజమానులకు రైతు బంధు పథకం ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ నిర్ణయం పట్ల రైతు లోకం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img