Homeసైన్స్​ & టెక్నాలజీBacteria Save Us : విషం తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది..

Bacteria Save Us : విషం తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది..

This bacteria save us from poison also : అన్ని బ్యాక్టీరియాలు హానికరం కాదనే విషయం మనం మరిచిపోతున్నాం.

విషపూరితాలు ఉన్న నీటిని తాగినా మనల్ని ఒక రకం బ్యాక్టీరియా కాపాడుతున్నది. 

ఈ బ్యాక్టీరియాలు నీటిలోని విషపూరితాలను తినేయడం ద్వారా మనకు మంచి చేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం అంతర్జాతీయ ‘జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ కెమికల్ ఇంజినీరింగ్’ లో ప్రచురితమైంది.

ఈ తాజా అధ్యయనం ప్రకారం, కొన్ని బ్యాక్టీరియా నీటిలోని విష లోహాలను తినేస్తాయి.

ఈ బ్యాక్టీరియాకు ‘మైక్రోబాక్టీరియం పారాక్సిడాన్స్ స్ట్రెయిన్ వీఎస్‌వీఎం ఐఐటీ (బీహెచ్‌యూ)’ అని పేరు పెట్టారు.

ఈ బ్యాక్టీరియా నీటిని మానవులకు సురక్షితంగా త్రాగడానికి చేస్తుందని కనుగొన్నారు.

డాక్టర్ విశాల్ మిశ్రా, పీహెచ్‌డీ విద్యార్థి వీర్ సింగ్ – ఈ బ్యాక్టీరియా అత్యంత కలుషితమైన పారిశ్రామిక నీటి నుంచి కూడా విషాన్ని తొలగించగలదని గుర్తించారు.

మురికినీటి నుంచి విషపూరిత హెవీ మెటల్ హెక్సావాలెంట్ క్రోమియంను ఈ బ్యాక్టీరియా వేరు చేస్తుంది.

బాక్టీరియల్ ఐసోలేట్ 200 mg/L Cr (VI) వరకు తట్టుకోగలదు.

50 mg/L Cr (VI) లో పెరిగినప్పుడు గరిష్టంగా 99.96 శాతం విషాల తొలగింపు సామర్థ్యాన్ని చూపించినట్లు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.

హెక్సావాలెంట్ క్రోమియం ఉన్న నీటిని వినియోగించడం ద్వారా మనుషుల్లో వివిధ రకాల క్యాన్సర్లు, వంధ్యత్వం, కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలను కలిగిస్తుంది.

హెక్సావాలెంట్ క్రోమియం అధిక సాంద్రతలను మైక్రోబాక్టీరియం పరాక్సిడాన్స్ స్ట్రెయిన్ తట్టుకోగలదు.

ఇది సంప్రదాయ పద్ధతులతో పోల్చినప్పుడు వ్యర్థజలాల నుంచి విషపూరిత పదార్థాలను తొలగించడంలో అత్యంత ప్రభావవంతమైనదని పరిశోధకులు భావిస్తున్నారు.

హెక్సావాలెంట్ క్రోమియంను తొలగించే ఈ పద్ధతి చాలా ఖర్చుతో కూడుకున్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Recent

- Advertisment -spot_img