క్రైస్తవులు దేవుడిగా ఆరాధించే ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజే ఈ గుడ్ ఫ్రైడే. ప్రజల రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ రోజు అందరూ ఉపవాస దీక్షలు చేసి క్రీస్తును ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
అయితే దీనిని ఒక శుభకార్యంలా కాకుండా.. క్రీస్తు సంతాప దినంగా జరుపుకుంటారు. ఏసుకు శిలువ వేయబడిన మూడు రోజుల తర్వాత పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్‌గా పాటిస్తారు.