యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఈ నేరానికి పాల్పడిన యువతిని గుర్తించి, అరెస్టు చేశారు. నిందితురాలు మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఫాతిమా ఖాన్(24)గా గుర్తించారు. ఫాతిమా మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు తెలిపారు. 10 రోజుల్లోగా యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవికి రాజీనామా చేయకుంటే ఆయనను చంపేస్తానని ఆమె హెచ్చరించింది.