Homeఫ్లాష్ ఫ్లాష్గొంతులో సమస్యకు చక్కటి చిట్కా..

గొంతులో సమస్యకు చక్కటి చిట్కా..

గొంతులో స‌మ‌స్య ఉంటే ఎవ‌రికైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ఈ స‌మ‌స్య‌ను ఎవ్వరైనా గతంలోనైనా ఎదుర్కొని ఉంటారు.

సాధార‌ణంగా గొంతులో గ‌ర‌గ‌ర‌, నొప్పి, మంట లాంటి స‌మ‌స్య‌లు క‌నిపిస్తూ ఉంటాయి.

ఈ సమస్య కొందరికి చ‌ల్లటి నీళ్లు తాగినా లేదా ఏదైనా చ‌ల్ల‌టి ప‌దార్థం తిన్నా వెంటనే గొంతులో ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తుంది.

ఇక దీనినుంచి ఉపశమనం పొంద‌డానికి ప‌నిచేసే చిట్కా ఏందో ఇప్పుడు తెలుసుకుందాం..!

ఒక గిన్నెలో పావులీట‌ర్ నీళ్లు పోసి దాన్ని వేడి చేయాలి.

అదే సమయంలో నీళ్ల‌లో చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, పదివ‌ర‌కు తులసి ఆకులు, పావు స్పూన్ పసుపు వేసి కాసేపు మరిగించాలి.

అలా మరిగిన‌ నీటిని వడపోసి ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగాలి.

డ‌యాబెటిస్ వ్యాధి ఉన్నవాళ్లు తేనె క‌లుప‌కుండా తాగడం మంచిది.

ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే స‌మ‌స్య నుంచి పరిష్కారం ల‌భిస్తుంది

Recent

- Advertisment -spot_img