Church Scam : సిద్దిపేటలో అధికారుల మాయాజాలం.. లేని చర్చికి 4 లక్షలు సాంక్షన్
Church Scam : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో అధికారుల మాయాజాలం బయటపడింది. గ్రామంలోని 727 సర్వే నెంబరులో ఎప్పటినుంచో చర్చి ఉందంటూ దాన్ని కూల్చి కొత్త చర్చి కట్టేందుకు అని అధికారులు ఆర్జీదారునికి ఏకంగా 4 లక్షలు ప్రజాధనాన్ని ముట్టజెప్పారు. నిజానికి అక్కడకు వెళ్లి చూస్తే ఆ సర్వే నెంబరులో గడ్డి తప్ప ఏమీ లేదు. పైగా అధికారులు స్థల పరిశీలన జరిపినట్లు దృవీకరించిన పత్రాలలో ఎక్కడో జరుగుతున్న సాదారణ నిర్మాణానికి సంబందించిన పిల్లర్ల నిర్మాణ ఫోటోను జతచేశారు. ఈ మాయాజాలంలో ఏ అధికారి పాత్ర ఎంత అని తెలియనప్పటికీ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరి అనుమతి పత్రాలు ఉన్నాయి. చిన్న కాగితం సరిగా లేకుంటేనే ప్రజలను బయటకు పంపే అధికారులున్న వేళ ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు రావడంతో గ్రామంలో పలువురు ఇంత తతంగం ఎలా జరిగిందంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థల పరిశీలన జరిపిన అధికారితో పాటు అన్ని రకాల పత్రాలు కింద చూడవచ్చు.