హైదరాబాద్ : ధరణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 11కు పైగా ఎంపీ సీట్లు సులభంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్ని. నేనెలా సీఎం అవుతా? సీఎం పదవిపై ఆశ లేదు. మీడియావాళ్లు ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటున్నారు. సీఎం అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ తనం అవుతుంది”. _ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
cm