ఇద్దరు దుర్మరణం
Tragedy at immersion: ఇదేనిజం, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనోత్సవంలో విషాదం చోటు చేసుకున్నది. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సంజీవయ్య పార్కు వద్ద గణపతిని తీసుకెళ్తున్న వాహనం కింద ప్రమాదవశాత్తు పడి కిషన్ బాగ్ కు చెందని ప్రణీత్ కుమార్ అనే బాలుడు చనిపోయాడు. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ సమీపంలో వాహనం కిందపడి మరో బాలుడు మృతి చెందాడు. సదరు బాలుడిది సంతోష్‌నగర్ ప్రెస్‌కాలనీ అని తెలుస్తోంది.