ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బూరుగుపల్లి గ్రామనికి చెందిన ఎర్రం లక్ష్మి (45) అను ఆమె గత ఐదు సంవత్సరాల నుండి కాలేయంలో గడ్డ పుట్టి తీవ్ర నొప్పితో బాధపడుతూ ఉండేది. హాస్పిటల్లో చూపించినా ఆ నొప్పి తక్కువ కాకపోవడంతో నొప్పి భరించలేక, జీవితం పై విరక్తి చెంది తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలదు, మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ధర్మపురి ఎస్సై జి.మహేష్ తెలిపారు.