Homeహైదరాబాద్latest NewsTTD : టీటీడీ నుంచి ఈవో, జేఈవో ఇద్దరు ఔట్..?

TTD : టీటీడీ నుంచి ఈవో, జేఈవో ఇద్దరు ఔట్..?

TTD : తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ (TTD) అధికారులపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా టిటిడి ఈవో, జేఈవో లుపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం టీటీడీ ఏఈవో గా వెంకన్న చౌదరి, ఈవో గా శ్యామలరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో, జేఈవో ల విషయంలో మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఘర్షణకు దిగారు. దీంతో టీటీడీలో భారీ మార్పులు ఖాయం అనే ప్రచారం సాగుతోంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు పూర్తయిన తర్వాత ఈవో, జేఈవో మార్పు ఖాయం అని తెలుస్తోంది. టీటీడీలో ఈఓ, జేఈవో పాత్ర కూడా కీలకం.. అలాంటిది వీరు టీటీడీ బాధ్యతలను నిర్వహించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో వీరిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీటీడీ ఈఓ, జేఈవో విషయంలో ఈ నెల 19 తర్వాత భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img