Homeహైదరాబాద్latest News'గేమ్ ఛేంజర్' ఈవెంట్ కు వచ్చిన ఇద్దరు మృతి…రామ్ చరణ్ కు చట్టం వర్తిస్తుందా..?

‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కు వచ్చిన ఇద్దరు మృతి…రామ్ చరణ్ కు చట్టం వర్తిస్తుందా..?

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా సమయంలో రేవతి అనే మహిళ మృతి చెందడం యావత్ చిత్ర పరిశ్రమను కుదిపేసింది.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడంతోపాటు ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడంతో వివాదం చెలరేగింది. అయితే తాజాగా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. ఈ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరికి గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. హీరో రామ్ చరణ్ ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ‘పుష్ప 2’ సినిమా ప్రమాదంలో మహిళ మృతిపై హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు రామ్ చరణ్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఈవెంట్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్‌లో చనిపోవడం రామ్ చరణ్ తప్పు కాదని రామ్ చరణ్‌కు మద్దతుగా వాయిస్‌లు వినిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img