ఇళ్లల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా ఓ ఇంట్లో గోడ నుంచి నీరు రావడంతో కుటుంబీకులు షాకయ్యారు. ఈ ఘటన యుపిలోని నోయిడాలో ఉన్న పాపులర్ ఫ్యూజన్ హోమ్స్ సొసైటీలో చోటు చేసుకుంది. ఓ ఖరీదైన ఇంటి గోడలకు ఏర్పడ్డ పగుళ్ల నుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. దీంతో ఇంట్లోని వారు అక్కడికి వెళ్లి పరిశీలించగా గోడ నుంచి నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చాయి. దీంతో ఇల్లంతా జలమయమైంది. పైప్‌లైన్ పగిలిపోవడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది.