బంగ్లాదేశ్‌లో అల్లరి మూకల ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. హిందువులను లక్ష్యంగా చేసుకొని కొందరు దాడులకు దిగుతున్నారు. ఇళ్లలోకి చొరబడి విచక్షణారహితంగా దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినా దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.