Homeహైదరాబాద్latest NewsVijay Deverakonda : తుఫాన్ వ‌చ్చే ముందు ఆ సైలెన్స్ అంతే.. రౌడీ టైమ్ బిగిన్స్..!!

Vijay Deverakonda : తుఫాన్ వ‌చ్చే ముందు ఆ సైలెన్స్ అంతే.. రౌడీ టైమ్ బిగిన్స్..!!

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కూడా అలానే అటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.మొదటిలో నానితో కలిసి ”ఎవడే సుబ్రహ్మణ్యం” అనే సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్టు కావడంతో విజయ్ కి వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత విజయ్ దేవరకొండ చేసిన ”అర్జున్ రెడ్డి” సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో విజయ్ పేరు అన్ని ఇండస్ట్రీల్లో మారుమోగిపోయింది. అయితే ఇటీవలే వరుస డిజాస్టర్ లు రావడంతో విజయ్ డీలా పడిపోయాడు.

ఎప్పుడు సోషల్ మీడియాలో.. సినిమా ఈవెంట్స్ లో యాక్టీవ్ గా ఉండే విజయ్ సడన్ గా సైలెంట్ అయిపోయాడు. అయితే పూరితో తీసిన ”లైగ‌ర్‌” సినిమాతో విజయ్ చాలా మారిపోయాడు. అప్పటివరుకు ఎనర్జీటిక్ స్పీచ్ లతో యువతను ఆకట్టుకున్న విజయ్.. ఇప్పుడు మాత్రం కొంచం మౌనంగా ఉంటున్నాడు. అయితే వరుస ప్లాపులు రావడంతోనే విజయ్ కావాలనే మౌనంగా ఉంటున్నాడు. ఎందుకంటే ఈ సారి తన మాటలతో కంటే తన సినిమా విజయంతోనే అందరికి సమాధానం చెప్పాలని చూస్తున్నాడు. విజయ్ ఫ్యాన్స్ తమ హీరో కామ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తుఫాన్ వ‌చ్చే ముందు ఆ సైలెన్స్ ఇలానే ఉంటుంది.. అందుకే విజయ్ దేవరకొండ కూడా ఒక బిగ్ హిట్టు ఇచ్చే ముందు ఆలా ఉన్నాడు అని ఫ్యాన్స్ అంటున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “కింగ్‌డమ్” (Kingdom) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. అయితే ఈ సినిమాతో విజయ్ ఒక భారీ హిట్టు కొట్టాలి అని చూస్తున్నాడు. అయితే నిర్మాత నాగ వంశి కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేసారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఈసారి బాక్సాఫీస్ను తగలబెట్టడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా మే 30న థియేటర్లో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img