Homeఫ్లాష్ ఫ్లాష్దక్షిణాదిలో హైయెస్ట్ లైక్డ్ టీజర్ "మాస్టర్"

దక్షిణాదిలో హైయెస్ట్ లైక్డ్ టీజర్ “మాస్టర్”

హైదరాబాద్: తమిళ్ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్ ఖాతాలో మరొక రికార్డు వచ్చి చేరింది.

ప్రస్తుతం ఈ హీరో కార్తీతో ఖైదీ వంటి బ్లాక్ బాస్టర్ సినిమా అందించిన లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్”.

దీపావళి కానుకగా విడుదల చేసిన టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వ్యూస్ పరంగా సౌత్ ఇండియా లోనే నెంబర్ వన్ గా నిలిచింది.

లైక్స్ పరంగా కూడా సెన్సేషనల్ రికార్డులు సెట్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు మరో ఫాస్టెస్ట్ మైల్ స్టోన్ ను అందుకుంది.

లేటెస్ట్ గా 40 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మరో రికార్డు సెట్ చేసింది.అంతే కాకుండా 2.4 మిలియన్ లైక్స్ తో మన దక్షిణాదిలో హైయెస్ట్ లైక్డ్ టీజర్ గా కూడా సెన్సేషనల్ రికార్దును అందుకుంది.

ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందివ్వగా విలన్ రోల్ లో టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.

తుపాకి సినిమా నుండి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్క తమిళం వరకే కాక ఇండియా వైడ్ గా పెరిగిపోయింది. ఈ హీరోకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img