Vijay – Rashmika : రౌడ్ట్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి ”గీత గోవిందం”, ”డియర్ కామ్రేడ్” అనే సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి మాల్దీవులు వెళ్లడం, కలిసి విదేశాల్లో తిరుగుతు ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రేమ జంట మరోసారి బీచ్‌లో చిల్ అవుతున్నారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా రష్మిక ఒమన్ దేశానికి వెళ్లింది. దానికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ కూడా బీచ్‌లో దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో విజయ్ తో కలిసి రష్మిక బీచ్‌లో బర్త్‌డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.