ఫోటో కోసం వచ్చిన అభిమానిని మెగాస్టార్ చిరంజీవి పక్కకు నెట్టేశారు. పారిస్ ఒలింపిక్స్ నుంచి తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చిరంజీవితో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అసహనానికి గురైన చిరంజీవి సదరు యువకుడని చేతితో పక్కకు తోశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.