Homeజిల్లా వార్తలుదివ్యాంగులకు అండగా ఉంటాం

దివ్యాంగులకు అండగా ఉంటాం

– జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

ఇదేనిజం, జగిత్యాల : దివ్యాంగులకు సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్‌ను అందజేశారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల పట్టణం వివేకానంద మినీ స్టేడియంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం, క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే క్రీడల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు బహుమతుల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలో మానసిక, అంగవైకల్యం ఉంటే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.రెండు లక్షల వరకు లోను ఇస్తుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన, దివ్యాంగుల పక్షాన పోరాడుతామన్నారు. సదరం క్యాంప్‌ ఏర్పాటు చేసి ధృవ పత్రాలు లేని వారికి ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, సంక్షేమ అధికారి నర్సయ్య, స్థానిక కౌన్సిలర్‌ చుక్క నవీన్‌, రోటరీ క్లబ్‌ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img