Homeహైదరాబాద్latest Newsకీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన విండీస్.. సెమీస్‌కు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా..!

కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన విండీస్.. సెమీస్‌కు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా..!

టీ20 వరల్డ్ కప్‌‌లో భాగంగా సౌతాఫ్రికాతో సూపర్‌8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 135/8కే పరిమితమైంది. రోస్టన్ చేజ్(52) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశారు. ఓపెనర్ కైల్ మేయర్స్(34బంతుల్లో 35 రన్స్) ఫరవాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో షంసీ 3 వికెట్లు తీసి విండీస్ నడ్డి విరిచారు. జాన్‌సెన్, మార్క్‌రమ్, మహారాజ్, రబాడ ఒక్కో వికెట్ తీశారు.
అయితే టీ20 ప్రపంచ కప్ సూపర్‌-8 గ్రూప్‌2 నుంచి సెమీస్‌కు చేరిన జట్లేవో తేలిపోయాయి. తొలుత యూఎస్‌ఏపై విజయం సాధించిన ఇంగ్లండ్‌ ఒక బెర్తును దక్కించుకోగా.. తాజాగా ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తు చేసి దక్షిణాఫ్రికా అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. దీంతో రెండు ఆతిథ్యదేశాలు ఇంటిముఖం పట్టడం గమనార్హం. సెమీస్‌లో ఏ జట్టు ఎవరితో ఢీకొట్టనుందనే విషయం ఇవాళ జరిగే భారత్‌-ఆసీస్‌, అఫ్గాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచులతో తేలనుంది.

Recent

- Advertisment -spot_img