Homeహైదరాబాద్latest Newsకీలక స్థానాల్లో ఓటమి..సీఎం గ్రాఫ్ పడిపోయిందా?

కీలక స్థానాల్లో ఓటమి..సీఎం గ్రాఫ్ పడిపోయిందా?

ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 8 సీట్లు సాధించినప్పటికీ ముఖ్యమంత్రి సొంతజిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో డీకే అరుణ గెలుపొందారు. 3636 ఓట్ల స్వల్ప మెజార్టీయే అయినా ఓటమి మాత్రం రేవంత్ రెడ్డికి పెద్దదెబ్బ తగిలిందనే చెప్పాలి. అంతేగాక రేవంత్ ఇంతకుముందు ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్‌గిరి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతకు కాకుండా ఈటల రాజేందర్‌ను గెలిపించుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రాముఖ్యత కంపించినట్లేనా? ముఖ్యమంత్రి అయి ఉండి కీలక స్థానాలను గెలిపించుకోలేని పరిస్థితిలో రేవంత్ ఉన్నారా? ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేవంత్‌పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం, పీసీసీ అధ్యక్షుడు పదవుల విషయంలో వ్యతిరేకతను ఎదుర్కొన్న సీఎం తాజా పరిణామాలతో డిఫెన్స్‌లో పడ్డట్లు తెలుస్తోంది. మాకొచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలా ఉన్నాయన్న సీఎం వ్యాఖ్యల్లో వాస్తవం లేదనేది నగ్న సత్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 8 స్థానాలు గెలిచినా..రేవంత్ ప్రతినిథ్యం వహించిస స్థానాల్లో మాత్రం అభ్యర్థులు పరాయజయం పాలయ్యారు. ఈ ఉగాది పచ్చడిలో చేదు మాత్రమే ఉందని, తీపి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img