వర్షాలతో పంటలు దెబ్బతినడంతో కాయగూరల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. బెండ, కాకర, బీరకాయ, బిన్నీస్, గోకరకాయ, క్యాప్సికం ధరలు బహిరంగ మార్కెట్‌లో రూ.80నుంచి రూ.100చొప్పున ధర పలుకుతోంది. టమాటా ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.60కి విక్రయిస్తున్నారు. రైతుబజార్లలో రూ.300కేజీ చొప్పున కొత్తిమిర విక్రయిస్తుండగా బహిరంగ మార్కెట్‌లో బంగారంలా తూచి విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డ రూ. వంద పెడితే కాని రెండు కిలోలు రావడంలేదు.