ఇదేనిజం, బుగ్గారం : యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నూకపెళ్లి గ్రామానికి చెందిన సైదల వంశీ (23)కి రెండు సంవత్సరాల క్రితం ఓబులపూర్ గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. సంవత్సరం క్రితం వీరిద్దరికి విడాకులయ్యాయి. దీంతో అప్పటినుండి తీవ్ర మనస్థాపానికి గురైన వంశీ ఒంటరి తనంతో తరచూ బాధపడేవాడు. ఈ క్రమంలో వంశీ బుధవారం తెల్లవారుజామున తన రూములో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి వెళ్లి చూడగా ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోయినట్లుగా నిర్దారించారు. మృతుడి తండ్రి సైదల రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ కృష్ణకుమార్ తెలిపారు.