UK KING:
క్వీన్ ఎలిజబత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, యువరాజు చార్లెస్-3 ఇంగ్లాడ్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. గురువారం 73 ఏళ్ల వయసులో పదవిని పొందిన వ్యక్తిగా నూతన అధ్యాయం లిఖించారు. శనివారం జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన రాజుగా బాధ్యతలు స్వీకరించారు. రాణి అస్తమయంతో ప్రిన్స్ ఛార్లెస్ పిలిప్ ఆర్థర్ జార్జ్ ఇప్పుడు కొత్త రాజు(చార్లెస్-3) అయ్యారని కౌన్సిల్ ప్రకటించింది. బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయన వెంట క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా, కుమారుడు విలియం కూడా ఉన్నారు. ఈ కార్యక్రమం సేయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి సారిగా టీవీలో ప్రసారం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన బాధ్యతలపై స్పష్టత ఉందని చెప్పారు.