Homeఆంధ్రప్రదేశ్ప్రధాని చేతుల మీదుగా మూడు రాజధానుల శంకుస్థాపన?

ప్రధాని చేతుల మీదుగా మూడు రాజధానుల శంకుస్థాపన?

ఆగస్టు 16న ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం
స్వయంగా ఆహ్వానించేందుకు అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్ కార్యాలయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్​లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా తాజాగా మూడు రాజధానుల శంకుస్థాపనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీనిలో భాగంగా సీఎం జగన్ కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రధానమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శి శేషాద్రికి ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఈనెల 16 న మంచి ముహూర్తం ఉందని ఆ తర్వాత మరో మూడు నెలల వరకు మంచి ముహూర్తం లేదని ఆ లేఖలో ప్రస్తావించినట్టు సమాచారం. వీలునుబట్టి ప్రధానమంత్రి స్వయంగా లేదా వర్చువల్​గా పాల్గొనవలసిందిగా ఏపీ సీఎం జగన్ స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానిస్తారని ఆ లేఖలో పేర్కొనట్లు తెలుస్తోంది. స్వయంగా ప్రధానిని కలిసేందుకు ఏపీ సీఎం జగన్​కి అపాయింట్మెంట్ ఇవ్వాలని పీఎంఓ కార్యాలయాన్ని లేఖలో కోరినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img