Jobs in indigo airlines : ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ట్రైనీ ఉద్యోగాలు
ఆసక్తిగల అభ్యర్థులు ఇండిగో రిక్రూట్‌మెంట్ (Recruitment) కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ goindigo.app.param.ai ను సందర్శించాలి.
ఈ వెబ్‌లింక్ ద్వారా పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ (Electronics), మెకానికల్ లేదా ఏరోనాటికల్ (Aeronautical) విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత ప్రమాణాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ ఏరోనాటికల్ విభాగాల్లో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
పదోతరగతి, ఇంటర్మీడియట్, బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
ఎంపికైన వారు చేపట్టాల్సిన విధులు..
– ఇండిగో ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కొన్ని బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.
అవేంటో చూద్దాం..
– ఎంపికైన వారు ఎయిర్‌క్రాఫ్ట్ రూటింగ్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండింగ్ సమయంలో మెయింటెనెన్స్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
వేర్‌హౌస్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ఫ్రంట్ లైన్ సపోర్ట్ విధులు, విమాన భాగాల మరమ్మతుతో పాటు నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి.
– మెటీరియల్స్, స్పేర్స్, టూల్స్, ఎక్విప్‌మెంట్ ప్లాన్ అండ్ ప్రొవిజనింగ్‌తో పాటు విడిభాగాల సేకరణ, లాజిస్టిక్స్ సపోర్ట్ అందించాలి.
ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్, సి-చెక్‌తో సహా దీర్ఘకాలిక ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ బాధ్యతను నిర్వహించాలి.
ఇన్సూరెన్స్, వారంటీ, బడ్జెటింగ్, కాస్ట్ కంట్రోల్.
కాంట్రాక్ట్స్ మేనేజ్‌మెంట్, లోకల్ / ఫారన్ విక్రేతలను అనుసంధానించండం, ప్రత్యేక ప్రాజెక్ట్‌లు / అధ్యయనాలు / సిస్టమ్స్, ప్రొసీజర్లను అమలు చేయడం… వంటి బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.