world tourism day : తెలంగాణ పర్యాటక వైభవాన్ని చాటేలా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు
రాష్ట్రం లో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు
రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రదేశాలకు తగిన టూరిజం ప్రమోషన్ ను నిర్వహించాలి.
‘యునెస్కో వారసత్వ కట్టడం’ గా గుర్తింపు సాధించిన రామప్ప దేవాలయం, ‘వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ ‘ గా ఎన్నికైనా భూధాన్ పోచంపల్లి ల విశిష్టతను చాటేలా పలు అంతర్జాతీయ వేదికలపై తగ్గిన ప్రచారం నిర్వహించాలి.
ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వాహణ పై సన్నాహాక సమీక్ష సమావేశం లో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యాటక శాఖ అధికారులకు దిశానిర్దేశం.
ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్ 27 వ తేదీ) ను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని HICC లో ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు సన్నాహక సమీక్షా సమావేశం ను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు నిర్వహించారు
సెప్టెంబర్ 27 న. హైదరాబాద్ హైటెక్స్ లో
ముఖ్యమంత్రి శ్రీ K.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం (సెప్టెంబర్ 27 వ తేదీన) నిర్వహించబోయే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని HICC (HITEX) లో ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర పర్యాటక వైభవాన్ని దశదిశల చాటేలా ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు టూరిజం శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, అకర్షణలు, చారిత్రాత్మక, పురావస్తు ప్రదేశాలు ఉన్నాయన్నారు. వాటి అభివృద్ధి కి సీఎం కేసీఆర్ గారు ఎంతో కృషి చేస్తున్నారన్నారు
విదేశీ పర్యాటకులను అక్కర్శించేలా
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ఈ సమీక్ష సమావేశం లో మాట్లాడుతూ..’యునెస్కో వారసత్వ కట్టడం’ గా గుర్తింపు సాధించిన రామప్ప దేవాలయం, ‘వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ ‘ గా ఎన్నికైనా భూధాన్ పోచంపల్లి ల విశిష్టతను చాటేలా పలు అంతర్జాతీయ వేదికలపై తగ్గిన ప్రచారం నిర్వహించాలని శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా సెక్రెటరీ గారిని ఆదేశించారు. ఈ సంధర్భంగా మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ లండన్ లో నవంబర్ 7 నుండి 9 వరకు జరగబోయే వరల్డ్ ట్రావెల్ మార్ట్ (WTM) లో తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రదేశాలకు తగిన ప్రమోషన్ ను నిర్వహిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
రామప్ప పై. ప్రత్యేక ఫోకస్
ఈ సమీక్ష లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి పెద్ద పీఠ వేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని టూరిజం ప్రాంతాలను పెద్ద ఎత్తున అభివృద్ధి పరచి ప్రపంచ దేశాలలోని పర్యాటకులను తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షితులను చేశారన్నారు. అందులో భాగంగా ములుగు జిల్లా లోని రామప్ప కు UNESCO గుర్తింపు తో పాటు, యదాద్రి – భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి UNWTO గుర్తింపు లభించిందన్నారు. అలాగే, టూరిజం అభివృద్ధిలో బాగంగా రాష్ట్రంలోని భోగత వాటర్ ఫాల్స్, సోమశిల, మల్లెల తీర్ధం, ముత్యాల జలపాతం మరియు ఇతర జలాశయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామన్నారు మంత్రి
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారంలో వరల్డ్ టూరిజం డేకి సంబందించి రాష్ట్రంలోని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీస్, టూరిజం అధికారులతో సమావేశం నిర్వహించాలని మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ టూరిజం అధికారులను దిశానిర్దేశం చేశారు.
ప్యాకేజీలు ఇవే
ఈ సమీక్ష సమావేశం లో త్వరలో రామప్ప స్పెషల్ పాకేజీ బస్ తో పాటు, నాగార్జున సాగర్ – శ్రీశైలం – నాగార్జున సాగర్ రివర్ ప్యాకేజీ ను అందుబాటులో తేవాలని MD, TSTDC గారికి ఆదేశాలు జారీ చేశారు మంత్రి శV. శ్రీనివాస్ గౌడ్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో వాటర్ లెవెల్ నిండుగా వుండడం వలన ఈ ప్యాకేజీ ను త్వరగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ సమీక్ష లో హైదరాబాద్ – నాగార్జున సాగర్ – శ్రీశైలం – హైదరాబాద్ పాకేజ్ లో అన్నీ వసతులతో కలిపి పెద్దలకు రూ.4499/- పిల్లలకు రూ.3600/- తో నిర్ణయించడం జరిగింది. ఎవరైతే నాగార్జున సాగర్ నుండి కృయిజ్ బోట్ లో వెళ్లాలనుకుంటే రూ. 2000/- చెల్లించే విధంగా ప్యాకేజీ ని నిర్ణయించారు. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 46464 (or) సెల్ నెంబర్. 98485 40371 సంప్రదించాలని నిర్ణయించారు.
ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మనోహర్ MD (TSTDC), ఓం ప్రకాష్, మహేశ్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇతర టూరిజం అధికారులు పాల్గొన్నారు.