Homeతెలంగాణgangula:గంగుల ఇంటి ముట్టడికి యత్నం

gangula:గంగుల ఇంటి ముట్టడికి యత్నం

– కరీంనగర్​లో తీవ్ర ఉద్రిక్తత
– భారీగా చేరుకున్న పోలీసులు

– మంత్రుల ఇండ్ల ముట్టడికి యత్నం

ఇదేనిజం, నెట్​వర్క్​: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని బీజేపీ శ్రేణులు గురువారం మంత్రుల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. పలు జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు అక్కడక్కడా బీజేపీ శ్రేణులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్​ జిల్లా కేంద్రంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. గంగుల కమలాకర్​ ఇంటివద్దకు భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. గురువారం ఉదయం నుంచి ముందస్తు అరెస్ట్‌లు చేసినా నిరసన ఆగలేదు. మంత్రి ఇంటి గేటు దూకి బీజేపీ శ్రేణులు లోపలకి వెళ్లాయి. పోలీసులు అడ్డుకుని బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలుచోట్లు బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img