ప్రపంచ కుబేరుల జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చేరారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 6.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు తన సంపదకు సంబంధించి గతంలో చెప్పిన అబద్ధాల కేసులో ఇటీవలే ట్రంప్‌కు కోర్టులో ఉపశమనం దొరికింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్ ఒకటి తాజాగా పూర్తయింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది.