ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఈరోజు టీవీల్లో ప్రసారం కానుంది. సాయంత్రం గం.5:30 లకు స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవనుంది. గత డిసెంబర్‌లో రిలీజ్ అయిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 700 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా విడుదలైన నాలుగు నెలలకు టీవీల్లో ఈ ప్రసారం అవుతోంది.