హీరో విశ్వక్సేన్ ‘గామి’ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. విశ్వక్సేన్ హీరోగా వస్తున్న మరో సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇది వరకే మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాను మే 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 27 సాయంత్రం 4.01 గం.కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా రీసెంట్ సెన్సేషన్ అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.