Homeహైదరాబాద్latest NewsWorld Cup 2024: భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు ఏమైంది?

World Cup 2024: భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు ఏమైంది?

టీ20 ప్రపంచకప్ మరో 26 రోజుల్లో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ నుంచి తృటిలో తప్పుకున్న టీమ్ ఇండియా.. ఈసారి షార్ట్ కప్ ను ముద్దాడుతుందని సెలక్టర్లు చాలా సీరియస్ గా ఆలోచించి ఈ జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన జట్టుపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయితే రింకూ సింగ్, సందీప్ శర్మ, నటరాజన్ వంటి ఆటగాళ్లను జట్టులో ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హార్దిక్ పాండ్యా లాంటి ఫామ్ లేని ఆటగాళ్లను ఎలా ఎంపిక చేశారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే టీమ్ ప్రకటించిన తర్వాత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎంపికైన కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో అత్యధిక పరుగుల స్పెల్ బౌలింగ్ చేశాడు. అర్షదీప్ సింగ్ కూడా ఉదారంగా పరుగులు ఇస్తున్నాడు. అంతకుముందు వరకు ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడిన శివమ్ దూబె వరుసగా రెండు సార్లు గోల్డెన్ డకౌటయ్యాడు. అంతకుముందు వరకు ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడిన శివమ్ దూబె వరుసగా రెండు సార్లు గోల్డెన్ డకౌటయ్యాడు. దీంతో అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఆటగాళ్లకు ఏమైందని ఆందోళన చెందున్నారు. పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసిన దుబే, అర్షదీప్ సింగ్‌లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో ఎంపికైన ఆటగాళ్లు ఏమైంది? శివమ్ దూబే వరుసగా రెండుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రెండుసార్లు అదే జట్టుపై స్పిన్నర్ల చేతిలో ఔట్ అయ్యాడు. అలాగే 167 స్కోరు నమోదైన మ్యాచ్‌లో అర్షదీప్ 10కి పైగా ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు” అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.

Recent

- Advertisment -spot_img