Homeహైదరాబాద్latest Newsరాయికల్ మండల కేంద్రంలో గ్రంథాలయానికి 37 ఏళ్లు గడిచిన అద్దె భవనమే దిక్కు..!

రాయికల్ మండల కేంద్రంలో గ్రంథాలయానికి 37 ఏళ్లు గడిచిన అద్దె భవనమే దిక్కు..!

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లాలో నే అతిపెద్ద మండలం అయిన రాయికల్ మండల కేంద్రంలో లైబ్రరీలో కనీస వసతులు కరువు సమాజంలో పోటీ పడి చదువుతున్న యువతకు కొత్త కొత్త విషయాలు తెలుకునేదుకు, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి గ్రంధాలయాలు ఉపయోగ పడుతాయి, పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి, కానీ రాయికల్ మండలంలో గ్రంథాలయంకు మేధాశక్తి పెంపొందించుకోవాలనే యువతకు నిరాశే ఎదురవుతుంది, రాయికల్ మండలంలోని 32 గ్రామాల ప్రజలతో పాటు పట్టణంలోని చాలా మందికి గ్రంథాలయం ఉంది అనే విషయం కూడా తెలియదు, ఎందుకంటే ఇప్పుడు పట్టణ శివారులోని ఒక అద్దె భవనం గ్రుధాలయం నడుస్తుంది, చిట్టా శివారులో ఉన్న విషయం ఎవరికి తెలియక గ్రంథాలయానికి వచ్చే వారు కరువైనారు, అందులో ఉన్న 11వేల పుస్తకాలు, రోజు వచ్చే దిన పత్రికలు చదివే వారు రాక వెల వెల పోతున్నాయి,

ఇక సొంత భవనం ఎప్పుడో!
రాయికల్ లో గ్రంథాలయం ఏర్పడి 37 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి సొంత భవనం నిర్మించలేదు, నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన స్థలం లేకపోవడంతో సొంత భవనం కలగానే మారింది అద్దె భవనంలో కొనసాగడం వల్ల వసతులు కల్పన ఇబ్బందిగా మారింది, ఇప్పటి మూడు అద్దె భవనాల్లోకి మారడం పట్ల గ్రంధాలయo ఎక్కడ ఉండా తెలియక వచ్చే పాఠకులు కరువైన్నారు, గ్రంథాలయం అందుబాటులో ఉంటే యువత రావడానికి ఆసక్తి చూపుతారు, యువతకు కొత్త విషయాలు తెలుకోవాలని ఆసక్తి పెరగదుతో పాటు వ్యాసనాలకు అలవాటు పడకుండా ఉండేందుకు కూడా దోహద పడుతుంది, 32 గ్రాముల ప్రజల సంక్షేమన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కలిగిన గ్రంథాలయ భవనాన్ని నిర్మిoచాలని పాఠకులు, ప్రజలు కోరుతున్నారు.

“ప్రజాప్రతినిధులు, అధికారులు చౌరవ చూపి గ్రంథాలయంకు సొంత భవనం నిర్మించాలి. పోటీ పరీక్షలు రాసే యువత చదుకోవాడానికి గ్రంథాలయం అవసరం. గ్రంథాలయం లేక పోవడంతో యువత రోడ్లపై, హోలల్ల దగ్గర కాలక్షేపం చేస్తున్నారు- చేట్ పెళ్లి గౌతమ్

Recent

- Advertisment -spot_img