ఇవాళ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పుట్టినరోజు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవచేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.