Homeహైదరాబాద్latest Newsగిరిజన లంబాడి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలి: కోర్ర...

గిరిజన లంబాడి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలి: కోర్ర చందు నాయక్

ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోర్ర చందు నాయక్ ఆదివారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ.హైదరాబాద్ మియాపూర్ పరిధిలో నివాసముంటున్న గిరిజన లంబాడి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశారు జూన్ 7 తారీఖు నాడు అదృశ్యమైన 12 సంవత్సరాల మైనర్ బాలిక చెత్త కుప్పలో శవమై కనిపించింది మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం ఎల్లంపేట గ్రామ పరిధిలో లక్ష్మీ తండకు చెందిన భానోత్ రమేష్ గిరిజన లంబాడి నిరుపేద కుటుంబం పొట్టకూటికోసం హైదరాబాదుకు వలస వచ్చరు కానీ కొంతమంది రాబందులు బానవత్ నరేష్ కుమార్తికి నరరూప రాక్షసుల చిన్న పిల్లని అని కనికరించకుండా కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశారు అనంతరం శవాన్ని కాల్చి ఒక చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయారు.

పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి వారం అవుతున్న పోలీసోళ్ళు జోక్యం చూసుకుంటూ ఉండిపోయారు పోలీసోలే పట్టించుకోని ఉండి ఉంటే ఆ మైనర్ బాలిక ప్రాణాలు కాపాడేవారు లాండ్ ఆర్డర్ పెద్దవాళ్లకు మాత్రమే నిరుపేద వారికి ఏమాత్రం లేదని చందు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారుగిరిజనులు అడవిలో గూడాల్లో తండాల్లో ఉంటూ అడవిలో ఉంటున్న పందులతోటి పులులతోటి సింహాలతోటి కొట్లాడి జీవనశైలి కొనసాగించారు కానీ హైదరాబాద్ మహానగరంలో గిరిజన బాలికలకు ఆడపిల్లకు రక్షణ లేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజన ఆడపిల్లల కు ఎంతోమంది రాబందులకు బలి అయి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం గిరిజన ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తుందని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి గిరిజన ఓటర్లు ఓటు వేసి గెలిపించారు. కానీ పోలీసు వారి నిర్లక్ష్యం ప్రభుత్వం వారి చేతగానితనం తో మా గిరిజన మహిళలు అత్యాచారానికి హత్యకి కిడ్నాప్ కి గురి అవుతున్నారని అన్నారు నిందితులను వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలి అప్పుడే గిరిజన మహిళలపై దాడి చేయాలన్న హత్య చేయాలని భయపడతారు లేని పక్షంలో ఈ ప్రభుత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img