Homeజిల్లా వార్తలుకళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం చింతపల్లిమండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం నాడు స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తన నివాసం వ్యవసాయ మార్కేట్ యార్డు దగ్గర 33 మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.100116/- ల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద ఇంటి ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.
గతంలో రైతుబందు పేరిట రైతుల ఖాతాలో ప్రతి ఎకరానికి 5000 రూపాయలు జమ చేసేవారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఎకరానికి 7500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 15000రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబోతున్నామని ఆరు గ్యారెంటీ పథకాన్ని దరఖాస్తు చేసుకోనివారు ఎంపిడిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ భవాని పవన్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణం, వైస్ ఎంపీపీ యాది గౌడ్,మాజి జడ్పీటిసిహరి నాయక్,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ రెడ్డి,చింతపల్లి మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి,ఎరుకల వెంకటయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్,మాజి సర్పంచ్ జితేందర్ రెడ్డి, గుణమొని కొండల్, ఎంపీటీసీ కంబాల పల్లి యాదయ్య,చెట్టుపల్లి రాములు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img