Homeజిల్లా వార్తలుచోల్లేటి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బ్యాగులు పెన్సిల్ అందజేత

చోల్లేటి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బ్యాగులు పెన్సిల్ అందజేత

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ మండలం కట్టకొమ్ము తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులకు చోల్లేటి ట్రస్ట్ సౌజన్యం సహకారంతో చోల్లేటి భాస్కరాచారి పేద విద్యార్థులకు స్కూల్ ఆవరణలో స్కూల్ బ్యాగులను, పెన్సిళ్లు, పెన్నులను అందించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్ శివయ్య, జాతీయ అవార్డు గ్రహీతలు చోల్లేటి భాస్కరాచారి, రాసమల్ల నాగయ్య ముదిరాజ్, కూరెళ్ళ కృష్ణచారి, పాఠశాల ఉపాధ్యాయులు పాండురంగారెడ్డి, కాంతయ్య వారు విద్యార్థులకు పెన్సిల్ పెన్నులు బ్యాగులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య అనేది మనిషికి జ్ఞానాన్ని సామాజిక అభివృద్ధిని అందిస్తుందని విద్యతోటే ప్రపంచాన్ని జయించొచ్చని నేటి బాలలే రేపటి పౌరులు అని మీరందరూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తెచ్చి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలని కోరారు. వీరి వెంట తిరుమల రావు, చోల్లేటి మణికంఠ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img