ఇదేనిజం, రాయికల్: రాయికల్ లో ఎస్సై లేక 15 రోజులు గడుస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని ‘ఇదేనిజం’ ప్రచురించిన కథనానికి ఎస్పీ స్పందించి రాయికల్ పోలీస్ స్టేషన్ కి SI నియామకం చేశారు. జగిత్యాల ఎస్పీ ఉత్తర్వుల మేరకు టి. అశోక్ రాయికల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా బాధ్యతలు స్వీకరించారు.