బాలయ్య పక్కన ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె స్టార్ హీరోయిన్.. బాలయ్య సినిమాలో బాలనటిగా చేసిన ఆమె ఆ తర్వాత బాలయ్య సినిమాలో.. బాలయ్య పక్కన హీరోయిన్ గా కూడా చేసింది. ఈ చిన్నారి మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్ రాశీ. ఒకప్పుడు కుర్రాళ్లను తన అందంతో కవ్వించింది రాశి. బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలయ్యతో రాశి బాలనటిగా నటించింది. అలాగే ఆ పక్కనే ఉన్న బాబు ఎవరో కాదు.. నందమూరి కళ్యాణ్‌రామ్. వీరిద్దరూ కలిసి ఆ సినిమాలో బాలనటులుగా నటించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా చేసిన ‘కృష్ణ బాబు’ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్ గా చేసింది రాశి.