పారిస్ ఒలింపిక్స్‌లో అఫ్గాన్‌కు చెందిన మనీజా తలాష్‌పై అనర్హత వేటు పడింది. ‘ఫ్రీ అఫ్గాన్ విమెన్’ అని రాసిన కేప్‌ను ధరించి బ్రేకింగ్ ఈవెంట్ ప్రి క్వాలిఫయర్ పోటీల్లో ఆమె పాల్గొంది. శరణార్థుల జట్టు తరఫున తలాష్ పాల్గొంది. ‘‘ పోటీల సందర్భంగా రాజకీయమైన స్లోగన్లను ప్రదర్శించడం సరైంది కాదు. అందుకే ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రపంచ డ్యాన్స్ స్పోర్ట్ ఫెడరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.