Homeజిల్లా వార్తలునెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపై కనబడితే సీజ్ చేస్తాం: ఎస్సై విజయ్ కుమార్

నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపై కనబడితే సీజ్ చేస్తాం: ఎస్సై విజయ్ కుమార్

ఇదేనిజం,కంగ్టి: నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపై కనబడితే సీజ్ చేస్తున్నామని ఎస్సై విజయ్ కుమార్ అన్నారు. సోమవారం కంగ్టి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ.. కొందరు వాహనదారులు వారి వాహనాలకు నెంబర్ ప్లేట్ తీసివేసి రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వాహనాల రోడ్లపై కనబడితే సిజ్ చేసి రవాణాశాఖ అధికారుల వద్దకు పంపిస్తాం అన్నారు. జిల్లా ఎస్పి రూపేష్ ఆదేశాల మేరకు ఇక నుండి ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు. అలాగే వారానికి ఒకసారి మెగా వాహనాల తనిఖీ చేస్తామన్నారు. వాహనదారులు రోడ్డు ప్రయాణం చేసేటపుడు తమ వద్ద బండికి సంబదించిన ఆర్ సి, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వెంట తీసుకెళ్లాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాల తనిఖీలు ప్రజల రక్షణ కొరకే పోలీసుల చేపడుతున్నట్లు తెలిపారు.వాహనాల తనిఖీ చేసేసమయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. వానదారులు నేషనల్ హైవేపై ప్రయాణం చేసేటప్పుడు రాంగ్ రూట్లో ప్రయాణం చేసి ప్రాణాలు కోల్పోతున్నారని కావున వాహనాదారులు నేషనల్ హైవేపై ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు నియమ నిబంధనలు ప్రతిఒక్కరు పాటించాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img