ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో అసత్య ప్రచారాలు చేసుకొని, ఇచ్చిన హామిలను ఎప్పటి నుండి అమలు చేస్తారో బడ్జెట్ లో చెప్పకపోవడం అంటే ప్రజలను మోసగించడమే అని వైసీపీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. నిర్దిష్టంగా ప్రజలకు కలిగే ప్రయోజనాలు తెలుపకుండా ఈ బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, వైస్సార్సీపీ ఫై నిందలతోనే నిండిపోయి,సామాన్య ప్రజానీకానికి నిరాశ మిగిల్చింది అని పేర్కొన్నారు. చివరకి చంద్రబాబు బడ్జెట్ స్వీయపొగడ్తలతో ఒక రాజకీయ కరపత్రంగా మిగిలిపోయింది అని విజయసాయిరెడ్డి అన్నారు.