తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. త్వరలోనే రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అడపాదడపా సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. కుల గణన తర్వాత రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.