Homeహైదరాబాద్latest Newsనేను చాలా నిజాయితీగా ఉన్నాను.. విడాకుల పుకార్లపై అభిషేక్ బచ్చన్ వివరణ

నేను చాలా నిజాయితీగా ఉన్నాను.. విడాకుల పుకార్లపై అభిషేక్ బచ్చన్ వివరణ

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడిగా అభిషేక్ బచ్చన్ సినీ రంగ ప్రవేశం చేశారు.ఆ తరువాత హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌తో ప్రేమలో పడి తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా వీరిద్దరూ విడాకులు తీసుకునట్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తన కూతురు ఆరాధ్య పుట్టినరోజు వేడుకలకు కూడా అభిషేక్ హాజరు కాకపోవడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.తాజాగా ఈ వార్తలపై అభిషేక్ స్పందించాడు. ప్రతికూల వార్తలను తాను పట్టించుకోబోనని తేల్చి చెప్పాడు. మన వ్యక్తిత్వంలో పట్టుదల అనే పదం ఉంది. మనం దానిని అలాగే ఉంచుకోవాలి మరియు మన మూలాధారాలను మార్చుకోకూడదు. విమర్శలకు భయపడి మనం ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే, మన స్వంత చర్యల ద్వారా మనం వదిలివేయబడతాము. చెడు తన చెడును వదులుకోనప్పుడు.. మంచి మాత్రం తన మంచిని ఎందుకు వదులుకోవాలని ప్రశ్నిస్తూ పరోక్షంగా విడాకుల వార్తలను తప్పుబట్టాడు. నేను చాలా నిజాయితీగా ఉన్నాను. దాన్ని ఎవరూ మార్చలేరు. నాపై వచ్చిన ఆరోపణలను వినడం నాకు ఇష్టం లేదు. మనలో ఎక్కడో ఒక ఆశ మెరుస్తూ ఉంటుంది. పట్టుదలతో ఉంటే ఎంతటి కష్టమైన అడ్డంకినైనా అధిగమించవచ్చు అని అభిషేక్ బచ్చన్ తెలిపారు.అందుకే తనలోని కొన్ని విషయాలు ఎప్పటికీ మారవని అభిషేక్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img