న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి సివిల్స్‌లో సత్తా చాటారు.
తొలి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు.
యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (UPSC) సోమవారం (జనవరి 4) 89 అభ్యర్థులతో రిజర్వ్ లిస్ట్ విడుదల చేసింది. వీరిలో అంజలి బిర్లా ఒకరు.
ఢిల్లీలోని రామ్జాస్ కాలేజీలో అంజలి ‘పొలిటికల్ సైన్స్ (ఆనర్స్)’ పూర్తిచేశారు. 2019లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు.
సివిల్ సర్వీసెస్‌కు ఎంపికవడం పట్ల అంజలి సంతోషం వ్యక్తం చేశారు. ‘నా తండ్రి (ఓం బిర్లా) దేశ ప్రజలకు నిబద్ధతతో సేవ చేయడాన్ని నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది నా కల’ అని ఆమె తెలిపారు.
చార్డర్డ్ అకౌంటెంట్ అయిన తన సోదరి ఆకాంక్ష.. తన సన్నద్ధత కోసం ఎంతగానో తోడ్పడినట్లు అంజలి తెలిపారు. తాను సాధించిన విజయాన్ని తన అక్కకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
సివిల్ సర్వీసెస్-2019 పరీక్షా ఫలితాలను 2020 ఆగస్టు 4న ప్రకటించారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు గ్రూప్ ఎ, గ్రూప్ బి లాంటి కేంద్ర సర్వీసుల కోసం మొత్తం 927 పోస్టులకు గాను.. 829 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
తాజాగా రిజర్వ్ జాబితా నుంచి వివిధ సివిల్ సర్వీసుల కోసం మరో 89 మంది అభ్యర్థులను ప్రకటించారు.