సాధారణ నిర్వహణ కారణాలతో 10 రైళ్ల నంబర్లను మారుస్తున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. విశాఖపట్నం-కడప మార్గంలో 17488/17487 నంబర్లతో నడిచే తిరుమల ఎక్స్ప్రెస్కు 18521/18522 నంబర్లను, విశాఖపట్నం- గుంటూరుమధ్య 22701/22702 నంబర్లతో నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్కు 22875/22876 నంబర్లను, భువనేశ్వర్-రామేశ్వరం మార్గంలో 20896/20895 నంబర్లతో నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్కు కొత్తగా 20895/20896 నెంబర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.